: మహారాష్ట్రలో ఎంఐఎంకు ఈసీ షాక్... స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హత!


గత ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీగా ప్రకటించుకున్న ఎంఐఎం పార్టీకి మహారాష్ట్ర ఈసీ షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. నిర్ణీత గడువులోగా పార్టీ ఆదాయ వ్యయాల ఆడిట్ నివేదిక సమర్పించనందున ఈ చర్యలు తీసుకున్నట్టు ఈసీ తెలిపింది. తాజా నిర్ణయం ఎంఐఎంకి తీవ్ర ఇబ్బంది కలిగించేదనే చెప్పచ్చు. 2015 లో జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన ఎంఐఎం ఊహించని ఫలితాలు సొంతం చేసుకుని ఆకట్టుకుంది. ఔరంగాబాద్ మున్సిపాలిటీలో ఏకంగా 24 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈసారి స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదామని భావించిన ఎంఐఎంకి ఈసీ నిర్ణయం షాక్ లా తగిలింది. కాగా ఆడిట్ నివేదిక సమర్పించాలని ఎంఐఎంను ఈసీ ఇప్పటికే ఆదేశించింది. ఆడిట్ నివేదిక సమర్పించకపోతే మహారాష్ట్రలో రాజకీయ పార్టీగా ఉన్న ఎంఐఎం రిజిస్ట్రేషన్ ను రద్దుచేస్తామని కూడా హెచ్చరించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఎంఐఎం పట్టించుకోకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ గుర్తుపై పోటీ చేసే అవకాశం లేదు. స్వంతంత్రులుగా పోటీ చేసి, తరువాత ఎంఐఎంలో చేరే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News