: నాన్న చంపేస్తాడన్న భయంతోనే దాడి చేశాను: మద్రాస్ హైకోర్టులో తండ్రిపై దాడి చేసిన రాజేష్


దేశంలో కలకలం రేపిన మద్రాసు హైకోర్టులో లాయర్ పై కత్తులదాడి కేసులో నిందితుడు రాజేష్ ను పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, బీకాం పూర్తి చేసిన తాను తన తండ్రి వద్దే అసిస్టెంట్ గా పని చేస్తున్నానని అన్నాడు. లాయర్ మణిమారన్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంటికి రావడం మానేశాడని తెలిపాడు. దీంతో తన చెల్లెలి వివాహం కూడా ఆలస్యమైందని రాజేష్ తెలిపాడు. దీనిపై తాను ప్రశ్నిస్తుండడంతో తన తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని, రౌడీలతో సంబంధాలు ఉన్న తన తండ్రి తనను చంపేస్తాడేమోనన్న భయంతోనే తాను ఆయనను హతమార్చాలని భావించానని రాజేష్ పోలీసులకు తెలిపాడు. కాగా, మణిమారన్ పై కత్తులతో దాడికి దిగిన సందర్భంగా దగ్గర్లో ఉన్న పోలీసులు స్పందించడంతో అతనిని అడ్డుకుని, మణిమారన్ ను ఆసుపత్రికి తరలించి, రాజేశ్ కు దేహశుద్ధి చేశారు. తీవ్రంగా గాయపడిన రాజేష్ ను కూడా ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, రాజేష్ ను పోలీసులు విచారించారు.

  • Loading...

More Telugu News