: సెప్టెంబరులో విశాఖలో మరో భారీ సదస్సు
మరో రెండు నెలల్లో విశాఖ సాగర తీరం మరో ప్రపంచ స్థాయి సదస్సుకు వేదిక కానుంది. సెప్టెంబరు 14 నుంచి బ్రిక్స్ దేశాల మూడు రోజుల సదస్సు విశాఖలో జరగనుంది. పట్టణీకరణ ప్రధానాంశంగా కాన్ఫరెన్స్ జరుగనుండగా, 500 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సదస్సు నిర్వహణ, అతిథులకు ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ టక్కర్ కొద్దిసేపటి క్రితం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులు హాజరై, సదస్సు నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై సలహా, సూచనలు ఇచ్చారు. కాగా, ఇప్పటికే విశాఖలో పెట్టుబడుల సదస్సు, మారీటైం సదస్సులు విజయవంతమైన నేపథ్యంలో బ్రిక్స్ సదస్సు కూడా విశాఖలోనే నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.