: మంగళగిరి ‘మాయ దందా’పై మంత్రి శిద్ధా ఫైర్!... ఎంవీఐపై చర్యలకు ఆదేశాలు!
గుంటూరు జిల్లా మంగళగిరి రవాణా శాఖ కార్యాలయం (ఆర్టీఏ)లో చోటుచేసుకున్న ‘మాయ దందా’పై ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఫైరయ్యారు. ఉనికిలోనే లేని 27 వాహనాలకు ఎంవీఐ నాగేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేసిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనువెంటనే రవాణా శాఖ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ తరహా మోసాలపై ఉక్కుపాదం మోపాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.