: దటీజ్ అనిల్ స్టయిల్... టీమిండియాకు కోడ్ ఆఫ్ కాండక్ట్, ఆలస్యంగా వస్తే ఫైన్!
భారత క్రికెట్ జట్టుకు కొత్తగా కోచ్ గా నియమితుడైన అనిల్ కుంబ్లే తనదైన మార్క్ చూపించడం ప్రారంభించాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో రెండు రోజుల వార్నప్ మ్యాచ్ ఆడటానికి ముందు 'కోడ్ ఆఫ్ కాండక్ట్' నిబంధనలను విధించాడు. శిక్షణా తరగతులకు ఆలస్యంగా వచ్చే క్రికెటర్లకు జరిమానా తప్పదని హెచ్చరించాడు. లేటుగా వస్తే 50 డాలర్ల జరిమానా చెల్లించాల్సి వుంటుందని తెలిపాడు. కాగా, నిన్నంతా అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి నివీస్ దీవిలో కాలం గడిపారని తెలుస్తోంది. భారీ షెడ్యూల్ ముందున్న వేళ, ఆటగాళ్లు ఇంకొంత విశ్రాంతి తీసుకుంటారన్న ఉద్దేశంతోనే మంగళవారం నాడు వారిని విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. వెస్టిండీస్ తో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్ లనూ గెలిస్తే, ఇండియా టెస్టుల్లో నంబర్ వన్ స్థానానికి చేరుతుంది. ప్రస్తుతం టీమిండియా ముందున్న లక్ష్యమిదే!