: బరి తెగించిన కశ్మీరీ యువత!... 70 తుపాకులను ఎత్తుకెళ్లిన వైనం!


హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ తో జమ్ము కశ్మీర్ లో చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆరు రోజులుగా సాగుతున్న అల్లర్లలో 25 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా... బరి తెగించి రోడ్ల మీదకు వస్తున్న కశ్మీర్ యువత పోలీసులపైకి రాళ్లు రువ్వుతూనే ఉంది. తాజాగా నిన్న ఆందోళనలకు దిగిన యువత... రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన 70 తుపాకులను ఎత్తుకెళ్లిందట. రేపు (శుక్రవారం) ముస్లింల ప్రార్థనల సందర్భంగా ఈ తుపాకులతో ఆందోళనకారులు విరుచుకుపడే అవకాశాలున్నాయని భద్రతా దళాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే తుపాకుల గల్లంతుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... ఎత్తుకెత్తిన సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ రకాలకు చెందిన సదరు తుపాకులను ఆందోళనకారులు ఎక్కడ దాచారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News