: గుజరాత్ లో వీధుల్లోకి ఎనిమిది సింహాలు, ఆందోళనలో ప్రజలు... వీడియోను మీరూ చూడండి!


దట్టమైన అడవుల్లో ఉండాల్సిన సింహాలు రోడ్డెక్కాయి. గత రాత్రి గుజరాత్ లోని జునాగఢ్ పట్టణంలోని ఓ నివాస ప్రాంతంలోకి ఒకటి, రెండు కాదు... ఏకంగా ఎనిమిది సింహాలు వచ్చాయి. వీటిని పలువురు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. సింహాలు దర్జాగా రోడ్డుపై నడిచి వెళుతుంటే, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ సింహాల్లో రెండు కూనలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో గిర్ రీజియన్ కు దగ్గరగా ఉన్న అమ్రేలీ జిల్లాలో మూడు సింహాలు ఓ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తన గ్రామం సమీపంలో గొర్రెలు కాస్తున్న ఓ వ్యక్తిపై సింహాలు దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో గుజరాత్ లో సింహాలు నివాస ప్రాంతాలకు వచ్చి దాడులు చేస్తున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి నుంచి మే మధ్య అమ్రేలీ ప్రాంతంలోనే ముగ్గురిపైనా, సోమనాథ్ జిల్లాలో ఓ మహిళపైనా సింహాలు దాడులు చేశాయి.

  • Loading...

More Telugu News