: రమ్య మృతి ప్రాంతంలో కేటీఆర్... పంజాగుట్టలో విస్తరణకు ఆదేశాలు!


హైదరాబాద్ లోని పంజాగుట్టలో ప్రధాన రహదారి ఇరుకుగా ఉందని, దీన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. చిన్నారి రమ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. రోడ్డు ఇరుకుగా ఉండటం కూడా ప్రమాదానికి కారణమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాగా, తాగుబోతులు సృష్టించిన వీరంగం అ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అభం శుభం ఎరుగని చిన్నారి రమ్య, తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News