: ఏపీలో చౌక ధరలకే సెల్ ఫోన్లు!... వ్యాట్ తగ్గిస్తూ చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం!


దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో ఇకపై చౌక ధరలకే సెల్ ఫోన్లు లభ్యం కానున్నాయి. ఈ మేరకు నిన్న ఏపీ రెవెన్యూ (రాబడి) శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకెళితే... ప్రస్తుతం సెల్ ఫోన్లు, వాటి బ్యాటరీలు, ఛార్జర్లు షెడ్యూల్ 5 కేటగిరీ వస్తువులుగా ఉన్నాయి. దీంతో వీటి విక్రయాలపై 14.5 శాతం వ్యాట్ ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. తాజాగా వీటిని షెడ్యూల్ 4 కేటగిరీ వస్తువులుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వీటిపై విధించే వ్యాట్ 14.5 శాతం నుంచి ఒకేసారి 5 శాతానికి పడిపోయింది. వెరసి ఏపీలో సెల్ ఫోన్లు, వాటి బ్యాటరీలు, ఛార్జర్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.

  • Loading...

More Telugu News