: డోంట్ వర్రీ... ఎలా గెలవాలో కుంబ్లే నేర్పుతాడు: సచిన్ విశ్వాసం


భారత క్రికెట్ రంగంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు మమేకమైన అనిల్ కుంబ్లే నుంచి నేటి తరం యువ క్రికెటర్లు ఎంతైనా నేర్చుకోవచ్చని లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. జట్టు ఎలా శ్రమిస్తే, గెలుపు బాటలో నడుస్తుందో కుంబ్లే నేర్పిస్తాడని, ఈ విషయంలో తనకు ఎలాంటి సందేహాలు లేవని అన్నారు. మైదానంలో రాజీపడే మనస్తత్వం లేని కుంబ్లే, ఎప్పుడు బరిలోకి దిగినా గెలవాలన్న దృఢ లక్ష్యంతోనే పోరాడుతాడని, ఇప్పుడు దాన్నే జట్టుకు నేర్పిస్తాడని అన్నారు. కుంబ్లే నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ విషయాలను తెలుసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News