: చెన్నైలో విక్రయానికి గంగా జలం... పెట్టిన బాటిళ్లన్నీ అమ్ముడయ్యాయి


తమిళనాడు ప్రజలకు పవిత్ర గంగానదీ జలాలు అందుబాటులోకి వచ్చాయి. గంగోత్రి, యమునోత్రి, రిషికేశ్‌ లాంటి పవిత్ర నదులను దర్శించుకోలేని ప్రజల కోసం పోస్టాఫీసుల ద్వారా గంగాజలాలను అమ్మనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెన్నైలోని పోస్టాఫీసుల్లో గంగాజలాన్ని విక్రయానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. చెన్నైలోని రెండు పోస్టాఫీసుల్లో ఈ బాటిళ్లను అమ్మకానికి ఉంచగా, విక్రయాలు ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే అన్ని బాటిళ్లు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు. కాగా, గంగోత్రి, రిషికేశ్‌ నుంచి ఈ జలాలను తెప్పించారు. 500 మిల్లీలీటర్ల గంగోత్రి జలాన్ని 35 రూపాయలకు, 200 మిల్లీలీటర్ల బాటిల్ ధర 25 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే రిషికేశ్‌ గంగాజలం బాటిల్ ధర 500 మిల్లీలీటర్లు 22 రూపాయలు కాగా, 200 మిల్లీలీటర్లు గంగాజలం 15 రూపాయలని వారు పేర్కొన్నారు. త్వరలో తమిళనాడు వ్యాప్తంగా పవిత్ర గంగాజలం బాటిళ్లను విక్రయానికి అందుబాటులో ఉంచనున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News