: సురేష్ ప్రభు ఎందుకు ప్రత్యేకమంటే...!
ప్రస్తుత రాజకీయాల్లో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ప్రత్యేకమైన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే, తన పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు చెప్పిన సామాన్య ప్రజలకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు, అదే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎంతో మందికి తిరిగి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ రీట్వీట్ చేశారు. కాగా, సామాన్య ప్రజల సమస్యలు అత్యంత వేగంగా పరిష్కరించే సురేష్ ప్రభుకు వివిధ వర్గాల ప్రజల్లో అత్యంత ఆదరణ ఉంది. కాగా, సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.