: చిన్నారి సానియాకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అంగీకారం
ఇటీవల భర్త రూపేశ్ చేతిలో దారుణంగా హత్యకు గురయిన కాంగో దేశస్థురాలు సింథియా కేసు విచారణ నిమిత్తం వారి కుమార్తె సానియాకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించడానికి రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టు ఈరోజు అనుమతి ఇచ్చింది. ఈనెల 15న చిన్నారి సానియా నుంచి అధికారులు డీఎన్ఏ శాంపిల్స్ సేకరించనున్నారు. కాలిపోయిన మృతదేహం సింథియాదేనని నిర్ధారణ చేయడం కోసం సానియాకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించనున్నారు. భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు రూపేశ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీంతో రేపటి నుంచి రూపేశ్‌ని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. మరోవైపు చిన్నారి సానియా ఎవరి సంరక్షణలో పెరగాలనే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుతం సానియా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంటోంది.