: గుడివాడలో వృద్ధురాలిపై టీడీపీ నేత దౌర్జన్యం
తన ఇంటిని కూల్చివేస్తుండటంతో ప్రశ్నించిన వృద్ధురాలిపై టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు దౌర్జన్యానికి దిగిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడలో జరిగింది. వృద్ధురాలి ఇంటిని సదరు నేత కూల్చివేశారు. దీంతో, ఈ విషయమై ఆమె ప్రశ్నించిగా ఆమెపై ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసులు కూడా అక్కడే వున్నారని... వారేమీ మాట్లాడలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇంటిని కూల్చివేస్తుండగా వృద్ధురాలికి గాయాలవడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.