: వర్షాలు లేకుండానే గోదావరికి భారీ వరద... కదిలిన చంద్రబాబు సర్కారు


రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకుండానే, ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నదికి భారీ ఎత్తున వరదనీరు తరలిరాగా, చంద్రబాబు సర్కారు అప్రమత్తమైంది. ఇప్పటికే రెండు సార్లు వరద పరిస్థితిపై రష్యా నుంచి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తనకు సమాచారం ఇవ్వాలని సీఎం కార్యాలయాన్ని ఆదేశించారు. దీంతో కదిలిన యంత్రాంగం గోదావరి ముంపు ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తం చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని కలెక్టరేట్ల పరిధిలో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూం ఏర్పాటైంది. కంట్రోల్ రూముల ఏర్పాటుపై సీఎం ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రెండు జిల్లాల కలెక్టర్లకూ సూచనలు అందించి, లోతట్టు ప్రాంతాలపై కన్నేసి ఉంచాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కాగా, ధవళేశ్వరం వద్ద ఇప్పటికే నీటిమట్టం 15 అడుగులను దాటగా, రాత్రికి వరద ఉద్ధృతి మరింతగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News