: 'కబాలి' సిమ్ కార్డులు విడుదల చేయనున్న ఎయిర్ టెల్
దక్షిణాది వ్యాప్తంగా 'కబాలి' సినిమా సందడి మొదలైంది. ఈ చిత్రం ఈ నెల 22వ తేదీన థియేటర్లను తాకుతుందని నిర్మాత కలైపులి థానూ ప్రకటించగానే పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటివరకూ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పటికే భారీ హైప్ ను క్రియేట్ చేయగా, తాజాగా, ఎయిర్ టెల్ ఈ చిత్రంతో జతకట్టింది. 'కబాలి' పేరిట ప్రత్యేక సిమ్ కార్డులను విక్రయించాలని నిర్ణయించింది. ఈ సిమ్ కార్డులపై రజనీ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. వీటిల్లో ప్రీ లోడెడ్ గా పలు వాల్ పేపర్స్, రింగ్ టోన్స్ వంటివి వస్తాయని సమాచారం. ఇక ఇప్పటికే ఎయిర్ టెల్ కనెక్షన్ ఉన్నవారికి స్పెషల్ రీచార్జ్ ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఎయిర్ టెల్ ఉన్నట్టు తెలిసింది. 'కబాలి' ప్రమోషన్ కోసం చౌక ధరల విమానయాన సంస్థ ఎయిర్ ఆసియా ప్రత్యేకంగా ఓ విమానాన్నే కేటాయించిన సంగతి తెలిసిందే.