: ఇదేం పధ్ధతి?... అసెంబ్లీలో కార్యాలయం రద్దుపై గవర్నర్ కు టీ టీడీపీ ఫిర్యాదు!
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో టీ టీడీఎల్పీ కార్యాలయానికి కేటాయించిన గదుల రద్దుపై ఆ పార్టీ నేతలు కొద్దిసేపటి క్రితం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్ భవన్ కు వెళ్లిన టీ టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తమకు కేటాయించిన గదులను ముందస్తు సమాచారం లేకుండానే ఇతరులకు ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. ఈ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. స్పీకర్ కార్యాలయంతో చర్చించి తమకు కేటాయించిన గదులను తమకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్ ను కోరారు.