: పుట్టపర్తిలో కేంద్ర మంత్రికి అవమానం!... హెలికాప్టర్ ల్యాండింగ్ కు ఎయిర్ పోర్టు సిబ్బంది నిరాకరణ!
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు అవమానం జరిగింది. సత్యసాయి ఆశ్రమంలో నేడు ప్రారంభం కానున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గోయల్ ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరారు. అయితే ఆయన ప్రత్యేక హెలికాప్టర్ కు సత్యసాయి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కు అనుమతి లభించలేదు. ఒక రోజు ముందుగా అనుమతి తీసుకుంటే తప్పించి ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని ఎయిర్ పోర్టు సిబ్బంది చెప్పడంతో గోయల్ షాక్ తిన్నారు. ల్యాండింగ్ కు అనుమతి లభించని కారణంగా గోయల్ హెలికాప్టర్ ను పైలట్ ఎయిర్ పోర్టు బయటే దించాల్సి వచ్చింది. ఆ తర్వాత గోయల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.