: కాశ్మీర్ ఆందోళనలపై మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
నాలుగు ఆఫ్రికా దేశాల్లో పర్యటించిన అనంతరం ఢిల్లీ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ అక్కడి ఆయన నివాసంలో ‘కాశ్మీర్‌లో శాంతి భద్రతలు’ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైట్లీ, పారికర్, సుష్మాస్వరాజ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. కాశ్మీర్ లో ఆందోళనకారులు చేస్తోన్న ఆందోళనలను అదుపుచేసేందుకు తీసుకున్న చర్యలపై మోదీకి రాజ్‌నాథ్ సింగ్ వివరిస్తున్నారు. సమీక్షలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేతపై చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు సుమారు 30 మంది మృతి చెందారు. ఆందోళనల్లో సుమారు 800 మంది గాయపడ్డారు. కాశ్మీర్లో వేర్పాటువాదులు చేపడుతోన్న బంద్ ఈరోజు కూడా కొనసాగుతోంది. శ్రీనగర్ తో పాటు చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా పరిస్థితి ఉంది.