: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం!... శంషాబాదులో 120 మంది ప్యాసెంజర్ల పడిగాపులు!


హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. నేటి తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాదు నుంచి కోల్ కతా బయలుదేరాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా విమానం టేకాఫ్ తీసుకోలేదు. వెరసి సదరు విమానంలో కోల్ కతా వెళ్లేందుకు లగేజీ సర్దుకుని ఎయిర్ పోర్టుకు వచ్చిన 120 మంది ప్రయాణికులు గంటల తరబడి అక్కడ పడిగాపులు పడుతున్నారు. ఎంతసేపటికీ విమానంలోని సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ఎయిరిండియా సిబ్బంది పూనుకోలేదు. దీంతో ఎయిర్ పోర్టులోనే ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News