: యూట్యూబ్ లో దూసుకెళుతున్న జూనియర్ ఎన్టీఆర్!... ‘జనతా గ్యారేజ్’కు వారంలోపే 40 లక్షల హిట్స్!


టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో సత్తా చాటుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’ టీజర్ కు యూట్యూబ్ లో వారంలోపే 40 లక్షల హిట్స్ వచ్చాయి. వెరసి యూట్యూబ్ లో అత్యధిక హిట్స్ లభించిన రెండో చిత్రంగా ‘జనతా గ్యారేజ్’ నిలిచింది. ఈ చిత్రం కంటే ముందు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘కబాలీ’ మాత్రమే ఉంది. యూట్యూబ్ లో విడుదలైన కేవలం గంటల వ్యవధిలోనే ‘జనతా గ్యారేజ్’ టీజర్ కు 10 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి. వారం క్రితం యూట్యూబ్ లోకి చేరిన ఈ టీజర్ ఇప్పటకీ టాప్ ట్రింగింగ్ లో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News