: మరో రూ.300 కోట్లు డిపాజిట్ చేస్తేనే సుబ్రతో రాయ్ బెయిల్ పొడిగింపు!: తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
సహారా ఇండియా పరివార్ చైర్మన్ సుబ్రతో రాయ్ బెయిల్ పొడిగింపునకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెయిల్ గడువును పొడిగించేందుకు ఇబ్బందేమీ లేదని చెప్పిన ధర్మాసనం... ఇప్పటికే తమ వద్ద డిపాజిట్ చేసిన రూ.200 కోట్లకు అదనంగా మరో రూ.300 కోట్లు డిపాజిట్ చేయాలని సహారాను ఆదేశించింది. ఆగస్టు 3 లోగా ఈ మొత్తం సొమ్మును తమ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో సుబ్రతో రాయ్ సహా మరో డైరెక్టర్ ను కూడా తిరిగి జైలుకు పంపుతామంటూ హెచ్చరికలు జారీ చేసింది.