: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సె కుమారుడి అరెస్టు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సె కుమారుడు నమల్ రాజపక్సె అరెస్టయ్యారు. కొలంబోలోని 650 మిలియన్ డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నమల్ రాజపక్సె అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న శ్రీలంక పోలీసులు కొలంబోలోని ఆయన నివాసంలో అయనను అదుపులోకి తీసుకున్నారు.