: బ్రిటన్ కు కాబోయే ప్రధాని థెరెస్సా మే!


బ్రెగ్జిట్ నిర్ణయం తరువాత ప్రధానిగా తప్పుకుంటానని బ్రిట‌న్‌ ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లను బ్రిటన్ ప్రధానిగా ఎవరు ఎదుర్కోనున్నారనే ఊహాగానాలకు తెరపడింది. బ్రిటన్ కాబోయే ప్ర‌ధానిగా థెరెస్సా మే ఒక్క‌రే రేసులో నిలిచారు. క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నుంచి ప్ర‌ధాని రేసుకు ఐదుగురు పోటీలో నిలవగా, ఎంపీల మధ్య జరిగిన ఓటింగ్ ద్వారా ఒక్కొక్కరు తప్పుకోవడం మొదలుపెట్టారు. చివరికి రేసులో ఆండ్రియాలీడ్‌ స‌మ్, థెరెస్సా మే రేసులో నిలిచారు. చివర్లో ఆండ్రియాలీడ్ సమ్ కూడా రేసు నుంచి తప్పుకోవడంతో డేవిడ్ కామెరాన్ వారసురాలిగా థెరెస్సా మే నిలిచారు. దీంతో ఆమె భవిష్యత్ బ్రిటన్ ప్రధానిగా ఖరారయ్యారు. కాగా, అక్టోబర్ లో కామెరాన్ పదవీబాధ్యతల నుంచి తప్పుకోగానే ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు.

  • Loading...

More Telugu News