: చార్మినార్ ప్రాంతంలో సిమ్ లు, సెల్ ఫోన్లు కొన్న ఉగ్రవాదులు... ఎన్ఐఏ విచారణలో కీలక సమాచారం
హైదరాబాద్ లో ఇటీవల పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాదుల నుంచి మరింత కీలక సమాచారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు రాబట్టారు. చార్మినార్ సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక స్టాల్ లో 9 ఎయిర్ సెల్ ప్రీ ఆక్టివేటెడ్ సిమ్ కార్డులను, ఐదు సెల్ ఫోన్లను నిందితుడు ఫాహెద్ కొనగా, మరో నిందితుడు ఇలియాస్ బీవీ బజార్ లో పేలుడు పదార్థాలను తూకం వేసే యంత్రాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆయుధాలు, పేలుడు పదార్థాలను అందించేందుకు, సిరియాలోని ఉగ్రవాదులతో సమాచార మార్పిడికి, కింది స్థాయి వారికి సమాచారం అందించేందుకు ఇబ్రహీం అనే మరో నిందితుడు సహకరిస్తున్నాడని, tutanota.com అనే వెబ్ సైట్ ద్వారా సిరియా తీవ్రవాదులతో వారు నేరుగా చాటింగ్ చేస్తున్నారనే కీలక సమాచారాన్ని ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలింది.