: ఘనంగా మూడో పెళ్లి చేసుకున్న అన్నా డీఎంకే వృద్ధ ఎంపీ
అన్నా డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ అన్వర్ రాజా అరవై ఏడేళ్ల వయస్సులో మూడో పెళ్లి చేసుకున్నారు. ముంబయికి చెందిన కుర్షిత్ భాను(50)ను సంప్రదాయపద్ధతిలో, మేళతాళాల మధ్య నిన్న పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధాప్యంలో తోడు కోసం ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. కాగా, కుర్షిత్ భాను భర్త గతంలో చనిపోవడంతో తన బతుకు దెరువు నిమిత్తం ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలని గతంలో అన్వర్ రాజాను కోరడం, మధురైలోని కేంద్రీయ విద్యాలయంలో ఆమెకు ఉద్యోగం ఇప్పించడం జరిగింది. ఈ క్రమంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. చెన్నైలోని రామనాథపురం జిల్లా మనైకుళం గ్రామానికి చెందిన అన్వర్ రాజా తన మొదటి భార్యతో గతంలో విడాకులు తీసుకున్నారు. రెండో భార్య అనారోగ్యంతో మృతి చెందింది.