: ఈనెల 16న హస్తినకు చంద్రబాబు


ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లడానికి ముందు రోజు (15న) పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో విభజన హామీలు నెరవేర్చుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించనున్నారు. అలాగే గత సమావేశాల్లో కేవీపీ ప్రవేశపెట్టిన పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చిస్తారు. అనంతరం 16న ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే అంతర్‌ రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News