: ప్రముఖ సినీ నృత్య దర్శకుడు వేణుగోపాల్ మృతి


ప్రముఖ కొరియో గ్రాఫర్ డి.వేణుగోపాల్ (94) చెన్నైలో కన్నుమూశారు. తెలుగు, కన్నడ, బెంగాలీ భాషలలో పలు చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అన్ని భాషలలోను కలిపి సుమారు 150 చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించిన ఆయన, నాటి టాప్ హీరోయిన్లు సావిత్రి, వహీదా రెహమాన్, జమున తదితరులకు ఆయనే డ్యాన్స్ చేయడం నేర్పించారు. కన్నడ చిత్రాలు జేనుగోడు, కవిరత్న, కాళిదాస, అపూర్వ సంగమ, సతీ సక్కుబాయి మొదలైన చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. వేణుగోపాల్ మృతిపై తెలుగు, కన్నడ, బెంగాలీ చిత్ర పరిశ్రమలకు చెందిన వారు సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News