: విశాఖలో ముంబై తరహా దాడికి ఉగ్రవాదుల పన్నాగం?
విశాఖపట్టణానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. తీర ప్రాంతంలోని భారత కీలక స్థావరాలపై లష్కరే తోయిబా ఉగ్రవాదుల కన్నుపడినట్టు తెలుస్తోంది. విశాఖపట్టణంలోని నౌకా స్థావరాలను ఐఎస్ టార్గెట్ చేసుకున్నట్టు, విశాఖలో ముంబై తరహా దాడికి ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్టుగా ఇంటెలిజెన్స్ సమాచారం. శ్రీలంకలో అరెస్టయిన ఐఎస్ఐ ఏజెంట్లను విచారించగా ఈ కీలక సమాచారం వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో భద్రతాదళాలను అప్రమత్తం చేశారు. విశాఖలో స్లీపర్ సెల్స్ సంచరిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు రహస్య నివేదిక అందినట్టుగా సమాచారం.