: సినిమా బాగుంటే నలుగురికి చెప్పండి... బాగోలేకపోతే నలభై మందికి చెప్పండి!: హాస్య నటుడు ధన్ రాజ్


ఏ సినిమా అయినా సరే బాగుంటే నలుగురికి చెప్పండి, బాగుండకపోతే నలభై మందికి చెప్పండి తప్పులేదు.. కానీ, సినిమాను థియేటర్లో చూడకుండా చెప్పడమనేది కరెక్టు కాదని ప్రముఖ హాస్యనటుడు ధన్ రాజ్ అన్నాడు. ధన్ రాజ్ నటించిన తాజా చిత్రం ‘పనిలేని పులిరాజు’లో ఆయన పదమూడు పాత్రల్లో నటించాడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఒక టీవీ ఛానెల్ ద్వారా ఆయన మాట్లాడుతూ, ప్రేక్షకులు సినిమాను థియేటర్ లో చూడకుండా బాగుండలేదని చెప్పొద్దని, ఎందుకంటే, థియేటర్ కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకులే తమను ఎదిగేలా చేస్తారని అన్నాడు. ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూస్తేనే తమకు ఫుడ్, బెడ్ ఉంటుందని అన్నాడు. నిర్మాత ఎంతో కష్టపడి సినిమా తీస్తాడని... ఆ సినిమాకు సంబంధించిన పైరసీ సీడీలు బయటకు వస్తే ఎంతో నష్టపోతాడని అన్నారు. పైరసీని ప్రోత్సహించవద్దని, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని ప్రేక్షకులకు ధన్ రాజ్ విజ్ఞప్తి చేశాడు.

  • Loading...

More Telugu News