: కోహ్లీ నాకు చెప్పేది ఒకటే...!: అమిత్ మిశ్రా


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు ఎలాంటి హద్దులు విధించడని స్పిన్నర్ అమిత్ మిశ్రా తెలిపాడు. వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ లో మిశ్రా 27 ఓవర్లలో 67 పరుగులిచ్చి 4 వికెట్లతో రాణించాడు. ఈ సందర్భంగా సెయింట్ కిట్స్ లో మిశ్రా మాట్లాడుతూ, కోహ్లీ అద్భుతమైన సహకారం అందిస్తాడని చెప్పాడు. విరాట్ లోని పాజిటివిటీతో జట్టులో మంచి వాతావరణం నెలకొందని అన్నాడు. తాను బౌలింగ్ చేసేటప్పుడు ఎటువంటి హద్దులు విధించలేదని చెప్పాడు. విరాట్ తనకు ఒకే విషయం చెప్పాడని, 'నీకు వికెట్లు సాధించే సత్తా ఉంది. నువ్వు ఏ రకంగా అయితే వికెట్లు సాధిస్తావని అనుకుంటున్నావో అదే చేయి. నీ బలాన్ని నీవు నమ్ముకో. మిగతా విషయాలు ఏమీ పట్టించుకోవద్దు' అని చెప్పాడని ఆయన తెలిపాడు. అంత మద్దతివ్వడం వల్లే తాను రాణించానని ఆయన చెప్పాడు.

  • Loading...

More Telugu News