: సల్మాన్ ని తాతయ్య అంటారా?... ఒక టీవీ ఛానెల్ పై మండిపడ్డ కండలవీరుడి తండ్రి


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై ఒక టీవీ ఛానెల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తండ్రి సలీం ఖాన్ మండిపడ్డారు. ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో సల్మాన్ ని తాత వయస్సుతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై సల్మాన్ తండ్రి సలీం ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారు సల్మాన్ ‘సుల్తాన్’ సినిమా చూసి మాట్లాడాలని, తాత వయస్సులో ఉంటే కనుక సల్మాన్ అలా నటించగలడా? అని సలీం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విషయంలో కొంతమంది ముందుంటారని, అటువంటి వారిలో ఆ తత్వాన్ని పోగొట్టేందుకు వారిలో మానవత్వాన్ని మేల్కొలపాలని... ఎందుకంటే, అదే గొప్ప మతం అని తన ట్వీట్ లో సలీం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News