: ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అనేది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాలేదు: మంత్రి తలసాని


ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అనేది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది కాదని, కొత్త ఎక్సైజ్ బార్లకు అనుమతి ఎవరికీ ఇవ్వలేదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కారు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య స్మృత్యర్థం ఒక టీవీ ఛానెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద్భరంగా తలసాని మాట్లాడుతూ, చిన్నారి రమ్య మృతి కేసుకు సంబంధించిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని, మద్యం అమ్మిన బార్ షాపును కూడా సీజ్ చేస్తామని చెప్పారు. పోయినవాళ్లను ఎలాగూ తీసుకురాలేమని, ఉన్నవాళ్ల బాధను అర్థం చేసుకుని వారికి న్యాయం చేసేలా చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బార్లకు కొత్త లైసెన్స్ లు ఇవ్వలేదని, ఆ బార్లన్నీ గతంలో ఉన్నవేనని తలసాని అన్నారు.

  • Loading...

More Telugu News