: షమీకి 2.23 కోట్ల పరిహారం అందజేసిన బీసీసీఐ
టీమిండియా పేసర్ మహ్మద్ సమీకి బీసీసీఐ పరిహారం అందజేసింది. గత ఏడాది ఆసీస్, కివీస్ తో జరిగిన ముక్కోణపు టోర్నీ సందర్భంగా షమీ గాయపడ్డాడు. గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ 8కి దూరమయ్యాడు. దీంతో షమీ ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో నష్టపరిహారం చెల్లించి, షమీకి ఆర్థిక వెసులుబాటు కల్పించాలని బీసీసీఐ భావించింది. దీంతో అతనికి పీజుగా చెల్లించాల్సిన 25 లక్షల రూపాయలతో పాటు కోటీ 98 లక్షల రూపాయలు కలిపి గత నెలలో అందజేసినట్టు నివేదికలో బీసీసీఐ తెలిపింది. దీంతో షమీకి 2.23 కోట్ల రూపాయలు అందజేసినట్టు బీసీసీఐ వెల్లడించింది.