: ముజఫరాబాద్ లో బుర్హాన్ సంస్కరణ సభ... కనిపించిన హఫీజ్ సయీద్


నాలుగు రోజుల క్రితం కాశ్మీరు లోయలో పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ సంస్మరణ సభ పాక్ ఆక్రమిత కాశ్మీరు రాజధాని ముజఫరాబాద్ లో కొద్ది సేపటి క్రితం జరిగింది. ఈ కార్యక్రమానికి హిజ్బుల్ చీఫ్ హఫీజ్ సయీద్ స్వయంగా హాజరై బుర్హాన్ మరణాన్ని ఓ త్యాగంగా కొనియాడాడు. ఆయన మరణం వందలాది మంది జీహాదీలకు స్ఫూర్తి నిస్తుందని అన్నాడు. ఇదే కార్యక్రమానికి మరో ఉగ్రవాది, ముంబై దాడులకు సహకారం అందించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సయ్యద్ సలావుద్దీన్ కూడా హాజరయ్యాడు. ముంబై ఉగ్రదాడి కేసులో వీరిద్దరినీ అప్పగించాలని ఇండియా కోరుతుంటే, వారు అసలు తమ దేశంలోనే లేరని ఓసారి, సరైన సాక్ష్యాలు సమర్పించాలని మరోసారి పాకిస్థాన్ వాదిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News