: విమానం కోసం అజర్ బైజాన్ లో 200 మంది భారతీయుల నిరీక్షణ!
లండన్ నుంచి ముంబైకి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాలతో అజర్ బైజాన్ లోని బాకూ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో దాదాపు 200 మంది భారతీయులు నానా అవస్థలూ పడుతున్నారు. ఈ విమానం గత రాత్రి లండన్ నుంచి బయలుదేరగా, ఈ ఉదయం బాకూలో దిగింది. అప్పటి నుంచి అందులోని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎయిర్ ఇండియా అధికారులు, వారిని స్వదేశానికి చేర్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపినట్టు తెలిపారు. చిక్కుకుపోయిన ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. కాగా, ఇప్పటికీ ఇంకా విమానం కోసం వారు వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది.