: బీఎస్పీకి మరో షాక్...జాతీయ కార్యదర్శి పదవికి పరందేవ్ రాజీనామా
బహుజన్ సమాజ్ వాద్ పార్టీ (బీఎస్పీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. గత నెల రోజుల వ్యవధిలో బీఎస్పీకి నలుగురు ముఖ్యనేతలు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా, బీఎస్పీ జాతీయ కార్యదర్శి పరందేవ్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. తన లాంటి అంకిత భావం గల నేతలను బీఎస్పీ పక్కన పెట్టి, విధేయత లేని వారిని ఎమ్మెల్సీలను చేస్తోందని ఆయన విమర్శించారు. డబ్బుంటే పార్టీ టిక్కెట్ల నుంచి పదవుల వరకు అన్నీ దక్కుతాయని ఆరోపించారు. తాను వారణాసికి వెళ్లిపోతున్నానని పరందేవ్ చెప్పారు.