: మేము రవిశాస్త్రి పేరు చెప్పాం... బీసీసీఐ ఒప్పుకోలేదు: గంగూలీ
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేసిన తరువాత, రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్ గా చేయాలని తాము ప్రతిపాదించామని, దీనిని బీసీసీఐ అంగీకరించలేదని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. కోచ్ ఎంపికతో తమ బాధ్యత తీరిపోయిందని, సహాయ కోచ్ ల ఎంపికలో తాము కల్పించుకోబోమని తెలిపాడు. కాగా, రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్ గా నియమించాలన్న ప్రతిపాదనలను బీసీసీఐ బోర్డు తోసిపుచ్చినట్టు గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 31న జరిగే పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సమావేశంలో గంగూలీని తిరిగి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సభ్యుల్లో గంగూలీని వ్యతిరేకించే వారు పెద్దగా లేకపోవడమే ఇందుకు కారణమని క్రీడా పండితులు భావిస్తున్నారు.