: నవ్వుతూ పాటలు పాడుతూ, డల్లాస్ పోలీసులను రెచ్చగొట్టిన జాన్సన్!


మిఖా జేవియర్ జాన్సన్ గుర్తున్నాడా.. నల్లజాతీయుల కాల్చివేతకు నిరసనగా డల్లాస్‌లో వెల్లువెత్తిన నిరసనల్లో ఐదుగురు పోలీసులను కాల్చిచంపిన వ్యక్తే జాన్సన్. నిరసనకారుల్లో దాక్కున్న ఈ మాజీ సైనికుడు వీలైనంతమంది శ్వేతజాతి పోలీసు అధికారులను చంపాలని అనుకున్నాడు. జాన్సన్ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. జాన్సన్ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. జాన్సన్‌ను గుర్తించిన పోలీసులు అతడిని చుట్టుముట్టి లొంగిపోవాల్సిందిగా సంప్రదింపులకు ప్రయత్నించారు. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో రోబో బాంబును ఉపయోగించి చంపేశారు. అయితే అతడిని చంపడానికి ముందు జాన్సన్ పోలీసులను తీవ్రంగా ఆటాడించాడట. పెద్దగా నవ్వుతూ పాటలు పాడాడట. ‘అవును ఇంతకీ ఎంతమంది అధికారులు పోయారు’ అని వారిని రెచ్చగొట్టాడట. ఈ విషయాలను డల్లాస్ పోలీస్ చీఫ్ డేవిడ్ బ్రౌన్ తెలిపారు. ఇలా దాదాపు రెండు గంటలపాటు రెచ్చగొట్టేలా ప్రవర్తించాడని ఆయన పేర్కొన్నారు. చివరికి విధిలేని పరిస్థితుల్లో రోబో బాంబును ఉపయోగించి చంపేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News