: ఆదిరెడ్డి ఎంట్రీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!... 20న సొంతగూటికి వైసీపీ ఎమ్మెల్సీ!


గడపగడపకూ వైసీపీ’ పేరిట ఏపీలో అధికార పార్టీ టీడీపీపై సుదీర్ఘ పోరు ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో భారీ ఎదురు దెబ్బ తగలనుంది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా నేత ఆదిరెడ్డి అప్పారావు తన సొంత గూడు టీడీపీలోకి చేరిపోయేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ విషయంపై ఆదిరెడ్డే స్వయంగా ‘మాట్లాడుతున్నాం’ అంటూ ప్రకటన చేసి పెను కలకలమే రేపారు. తాజాగా టీడీపీలోకి ఆయన చేరికకు సంబంధించి సీఎం నారా చంద్రబాబునాయుడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. దీంతో సొంత గూటికి చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఆదిరెడ్డి వర్గం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. ఈ నెల 20న టీడీపీలోకి చేరేందుకు ఆదిరెడ్డి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అనుకోని కారణాలతో 20న చేరిక సాధ్యం కాకపోతే... ఈ నెల చివరలో ఆయన చేరిక ఖాయమేనని తెలుస్తోంది. ఆదిరెడ్డి ఎంట్రీని వ్యతిరేకిస్తున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత గన్ని కృష్ణ ఇప్పటికే తన మనసు మార్చుకుని ఆదిరెడ్డి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఆదిరెడ్డికి రాజకీయ ఓనమాలు నేర్పిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఆదిరెడ్డి నేరుగా మంతనాలు సాగించేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న గోరంట్ల తిరిగి రాగానే ఆయన వద్దకు నేరుగా వెళ్లేందుకు ఆదిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News