: కేరళలో మరో ఏడుగురు మిస్సింగ్... ఐసిస్‌లో చేరి ఉంటారని అనుమానం


మిస్సింగుల కలకలం కేరళను కుదిపేస్తోంది. గతనెలలో 15 మంది యువకులు కనబడకుండా పోయిన సంగతి తెలిసిందే. వారి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. తాజాగా కసర్‌గోడ్‌లోని పడన్నా, త్రికారీపూర్ ప్రాంతాలకు చెందిన మరో ఏడుగురు యువకులు కనిపించకుండా పోయారు. వీరంతా ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరి ఉంటారని అనుమానిస్తున్నారు. యువకుల బంధువులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన మొహమ్మద్ ముర్షిద్, మొహమ్మద్ సాజిద్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మరికొందరు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఎం వారిని కోరారు. ఇన్వెస్టిగేషన్ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కసర్‌గోడ్ ఎస్పీ థామస్ జోస్ తెలిపారు. కాగా నెల రోజులు క్రితం మధ్యప్రాచ్యానికి వెళ్లిన 15 మంది యువకులు తిరిగి స్వస్థలాలకు చేరుకోలేదు. దీంతో వారు కూడా ఉగ్రవాద సంస్థలో చేరి ఉంటారని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News