: అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాను: బిన్ లాడెన్ కొడుకు హెచ్చరిక


అమెరికా హతమార్చిన అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ ప్రతీకారం తీర్చుకుంటామంటూ అగ్రరాజ్యాన్ని హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన ఒక ఆడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేశాడు. సుమారు 21 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో ఈ హెచ్చరికలు చేశాడు. అమెరికా, దాని మద్దతు దేశాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ గ్రూప్ పోరాటాన్ని కొనసాగిస్తామని, తామందరమూ ఒసామాలమేనని ఆ ఆడియోలో పేర్కొన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలోను, విదేశాల్లోనూ వారిని లక్ష్యంగా చేసుకుంటామని, దాడులు కొనసాగిస్తామని హెచ్చరించాడు. పాలస్తీనా, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, యెమెన్, సోమాలియా ఇతర ముస్లిం దేశాల్లో అమాయక పౌరులను హింసిస్తున్నందుకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నాడు.

  • Loading...

More Telugu News