: చిన్నారి రమ్య ప్రాణాలను బలితీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: కేటీఆర్


తప్పతాగి కారు నడిపి చిన్నారి రమ్య ప్రాణాలు పోవడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. రమ్య కుటుంబసభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్ వల్లే ఈ దారుణం జరిగిందని, అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. కాగా, తొమ్మిది రోజుల క్రితం మద్యం మత్తులో పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద చేసిన యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డ చిన్నారి రమ్య కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.

  • Loading...

More Telugu News