: సరిగ్గా ఏడాది క్రితం... రాజమౌళికి చెమటలు పట్టిన రోజు!


సరిగ్గా సంవత్సరం క్రితం... జూలై 10న ఓ తెలుగు చిత్రం విడుదలైంది. తెలుగు దర్శకుల సత్తాను ప్రపంచానికి చాటింది. ఏ హిందీ సినిమాకూ సాధ్యంకాని రికార్డులను అందుకుంది. ఏ సినిమా గురించి చెబుతున్నామో తెలిసిపోయిందా? అదే మన జక్కన్న సృష్టించిన 'బాహుబలి'. రెండేళ్ల పాటు కష్టపడిన రాజమౌళి టీం బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన రోజున, రాజమౌళి ఎంత టెన్షన్ పడ్డాడో తన ట్విట్టర్ ఖాతాలో గుర్తు చేసుకున్నాడు. సరిగ్గా 13 సంవత్సరాల క్రితం సింహాద్రి సినిమా విడుదలై టెన్షన్ పెట్టిందని, ఆపై పన్నెండేళ్ల తరువాత, బాహుబలి రిలీజ్ నాడు తాను అంతగా టెన్షన్ పడ్డానని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు. సంవత్సరం క్రితం ఈ సినిమాను చూసిన ప్రతిఒక్కరూ, తరువాయి భాగాన్ని చూసేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News