: కోహ్లీ తాగే నీటి ఖరీదు లీటరు రూ. 600!


విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు. ఇక కోహ్లీ ఏ హోటల్ లో బస చేసినా 'ఏవియాన్' బాటిల్ తప్ప మరో బ్రాండ్ మంచినీళ్లు తాగడు. ఇక ఈ నీళ్ల ఖరీదెంతో తెలుసా?.. లీటరు రూ. 600 మాత్రమే. నీళ్లకే కోహ్లీ కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాడని అనుకుంటున్నారా? అంతకన్నా ఖరీదైన మంచినీరు ప్రపంచంలో లభిస్తోంది లెండి. 'కోనా నిగరి' బ్రాండ్ నీరు 750 ఎంఎల్ రూ. 27 వేలు. దీని స్పెషల్ ఏంటో తెలుసా? హవాయి సమీపంలోని పసిఫిక్ సముద్రంలో రెండు వేల అడుగుల లోతు నుంచి నీరు తెచ్చి ఫిల్టర్ చేయడమే. అంత లోతులోని స్వచ్ఛమైన నీరు కాబట్టి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి జపాన్ లో మహా డిమాండ్. ఇక 'బ్లింగ్ హెచ్ టూవో' బ్రాండ్ నీరు రూ. 2,680గా ఉంది. టెన్నెస్సీ దగ్గరి నీటి బుగ్గల నుంచి నీటిని సేకరించి సర్వోస్కీ రాళ్లతో బాటిల్ ను అందంగా చేసి నీటిని నింపుతారు. 'వీన్' అనే బ్రాండ్ వాటర్ 750 ఎంఎల్ రూ. 1500కు, '10 థౌజండ్ బీసీ' బ్రాండ్ నీరు రూ. 950కి, 'ఆక్వా డెకో' రూ. 800కు బాటిల్ నీటిని విక్రయిస్తున్నాయి.

  • Loading...

More Telugu News