: గుజరాత్ కు సీఎంగా అమిత్ షా... తనకు సమాచారం అందిందంటున్న కేజ్రీవాల్


గుజరాత్ లో ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ అవినీతి పాలన ప్రజలకు విసుగు తెప్పిస్తోందని, దీనిని గమనించే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమిత్ షాను నియమించనున్నట్టు తనకు తెలిసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖతాలో ఈ విషయాన్ని తెలిపారు. అమిత్ షాను సీఎం చేయాలని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం అందినట్టు పేర్కొన్నారు. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి మద్దతు లభించిందని తెలిపారు. వచ్చే సంవత్సరం రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సందర్శించడం ద్వారా కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సూరత్ లో తన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా ఆనందీ బెన్ అడ్డుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News