: విదేశాల్లోనూ పెడదారి... చైనాలో మహిళా టూరిస్టును వేధించి బుక్కయిన భారతీయులు
చైనాలో ఓ మహిళా టూరిస్టును లైంగికంగా వేధించిన కేసులో ఇద్దరు భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హర్యానా ప్రాంతానికి చెందిన ఇద్దరు తేయాకు వ్యాపారం నిమిత్తం చైనాకు వెళ్లారు. వీరు ఓ హోటల్ కు వెళ్లిన సమయంలో అదే హోటల్ లో తైవాన్ నుంచి టూరిస్టుగా వచ్చిన యువతి దిగింది. హోటల్ లిఫ్టులో వీరిద్దరూ ఆ యువతిని చూసి, లైంగిక వేధింపులు మొదలు పెట్టారు. 7వ తేదీన ఈ ఘటన జరుగగా, పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరూ చైనా జైలులో కాలం గడిపాల్సిన పరిస్థితి ఏర్పడింది.