: మెక్సికోలో 15 మంది కాల్చివేత.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది


మెక్సికోలో వరుస కాల్పులు కలకలం సృష్టించాయి. సాయుధులైన దుండగులు కొందరు 15 మందిని కాల్చి చంపారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉండడం విషాదం. తమౌలిపస్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున టెక్సాస్‌కు సరిహద్దులో ఉన్న సియుడాడ్‌ పట్టణంలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు నిద్రపోతున్న 11 మందిని అత్యంత దారుణంగా కాల్చిచంపాడు. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పక్క ఊరిలో మరో ముగ్గురిని దుండగులు కాల్చి చంపారు. బస్టాండ్ వద్ద 16 ఏళ్ల యువకుడిని కాల్చేశారు. బాంబులతో ఓ ఇంటిని పేల్చేశారు. ఈ కాల్పుల వెనక ఎవరున్నదీ ఇప్పటికప్పుడు చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. అయితే పట్టణంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న జెటాస్ కార్టెల్ పని అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News