: కేంద్రమంత్రి కాన్వాయ్‌లోని జీపు ఢీకొని యువకుడి మృతి!


కేంద్రమంత్రి కాన్వాయ్‌లోని జీపు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన బిహార్‌లోని పట్నాలో చోటుచేసుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి రామ్ క్రిపాల్ యాదవ్ శనివారం ‘ఉజ్వల’ పథకాన్ని ప్రారంభించేందుకు పట్నాలోని మసౌరి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని పోలీసు జీపు దేవధన్ గ్రామ సమీపంలో బైక్‌పై వెళ్తున్న రాహుల్ కుమార్(18)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కిడికక్కడే మృతి చెందగా అదుపు తప్పిన పోలీసుల జీపు బోల్తా పడడంతో ఆరుగురు పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదో విషాద ఘటన అని, దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • Loading...

More Telugu News