: 'సీటు గ్యారంటీ లేదా ఫీజు వాపస్' ప్రకటనపై శ్రీ చైతన్య విద్యా సంస్థలకు నోటీసులు


శ్రీ చైతన్య విద్యా సంస్థలు 'ష్యూర్ నీట్' పేరిట, తమ వద్ద చదువుకున్న ప్రతి ఒక్కరికీ మెడికల్ సీటు గ్యారంటీ అని, సీటు రాకుంటే 65 శాతం ఫీజును వాపస్ ఇస్తామని చేస్తున్న ప్రచారంపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మండిపడింది. ఈ తరహా ప్రకటనలు పత్రికల్లో ఇవ్వడం చట్ట విరుద్ధమని తెలియజేసింది. ఈ విషయంలో సెక్షన్ 25/1997, 7, 7ఏ ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో వెల్లడించాలని కోరుతూ, శ్రీ చైతన్యకు నోటీసులు జారీ చేసింది. తెలుగు విద్యార్థులను ప్రలోభ పెట్టేలా ఈ ప్రకటనలు ఉన్నాయని చెబుతూ, అకడమిక్ డైరెక్టరుకు నోటీసులు పంపింది. 15 వేల మందికి మెడికల్ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యార్థుల్లో ఆశలను పెంచే యాడ్స్ ఇస్తోందని, ఈ తరహా మోసపూరిత ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News